![]() |
![]() |
.webp)
గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి వాళ్ళ అమ్మ రోల్ లో నటించిన జగతి మేడం అంటే అందరికీ తెలుసు. ఆమె అసలు పేరు జ్యోతి పూర్వాజ్. ఐతే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో ఆడియన్స్ ముందు రాబోతోంది. ఐతే హౌస్ లోకి కంటెస్టెంట్స్ కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే చాల మంది పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు జ్యోతి పూర్వాజ్ కూడా బిగ్ బాస్ లోకి వెళ్లబోతోందా..అనే టాక్ నడుస్తోంది. ఆమె బిగ్ బాస్ కి వస్తే టిఆర్పిలు బద్దలైపోతాయి అనే చర్చ కూడా నడుస్తోంది. జ్యోతి ఇటు తెలుగులో అటు కన్నడలో సీరియల్స్, మూవీస్ లో నటిస్తోంది.
.webp)
ఇక గుప్పెడంత మనసు సీరియల్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఐతే మూవీస్ లో ఛాన్సెస్ రావడంతో ఆమె రోల్ ని మధ్యలోనే ముగించేయాల్సి వచ్చింది. ఇక తర్వాత మూవీస్ షూటింగ్స్ లో కనిపిస్తూ ఆ వీడియోస్ ని పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఐతే ఈ అందాల నటి రీసెంట్ ఒక పోస్ట్ ని తన స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. లాస్ట్ ఇయర్ కూడా బిగ్ బాస్ తెలుగు, కన్నడ ఇండస్ట్రీస్ నుంచి టీమ్ సంప్రదించారు కానీ ఆ టైంలో ఆ అవకాశాన్ని వదులుకున్నానని చెప్పింది. ఇక ఈ ఇయర్ కూడా బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చినా కానీ ఇప్పుడు కూడా బిగ్ బాస్ వెళ్లడం లేదు అని చెప్పింది. దానికి కారణంగా ప్రస్తుతానికి తానూ పూర్తిగా "కిల్లర్" మూవీ మీద ద్రుష్టి పెట్టానని అందుకే రియాలిటీ షోస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యట్లేదు అంటూ ఆ పోస్ట్ లో పేర్కొంది. సో జ్యోతి ఐతే బిగ్ బాస్ కి వచ్చే ఛాన్స్ లేనట్టే.
![]() |
![]() |